Weather Latest Update: వచ్చే మూడు రోజులు కాస్త ఊరట, వాతావరణం చల్లగా ఉంటుందన్న ఐఎండీ

Weather Latest Updates: ఉత్తర - దక్షిణ ద్రోణి విదర్భ నుండి మరోత్వాడ మీదగా ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ద్రోణి కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (Hyderabad Meterology Center) అధికారులు ఓ ప్రకటనలో మంగళవారం (మే 23) తెలిపారు. దీంతో రాగల మూడు రోజులు ఈ రోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు (Rains in Telangana) అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. రాగల 3 రోజులు ఉత్తర తెలంగాణ జిల్లాలలో గరిష్ట (పగటి) ఉష్ణోగ్రతలు 41 నుండి 43 డిగ్రీల వరకు నమోదు అయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్, చుట్టూ ప్రక్కల జిల్లాలలో పగటి ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల నుండి 40 డిగ్రీల వరకు నమోదు అయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ రోజు ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 30 నుండి 40 కిమీ) తో కూడిన వర్షాలు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది.

హైదరాబాద్ లో ఇలా (Hyderabad Weather)

‘‘ఆకాశం పాక్షికంగా మేఘావృతంగా ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 39 డిగ్రీలు, 27 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు వాయువ్య దిశ నుంచి గాలి వేగం గంటకు 4 నుంచి 08 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 40 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 27 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 84 శాతంగా నమోదైంది.

ఏపీలో కూడా నేడు కాస్త చల్ల వాతావరణమే (AP Weather)

నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) రాబోయే రెండు రోజుల్లో దక్షిణ బంగాళాఖాతం, అండమాన్‌ సముద్రం, అండమాన్‌ నికోబార్‌ దీవుల్లోకి ప్రవేశించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు (Amaravati Meterology Center) తెలిపారు. ఉత్తర - దక్షిణ ద్రోణి విదర్భ నుంచి ఉత్తర కేరళ వరకు మరఠ్వాడా అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. దక్షిణ తమిళనాడు పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో ఉంది.

‘‘ఏపీలో దిగువ ట్రొపోస్పియర్‌ దక్షిణ, నైరుతి (Southwest) దిశలో గాలులు వీస్తున్నాయి. రాబోయే 3 రోజుల్లో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌, యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలో గణనీయమైన మార్పు లేదు. రాగల మూడు రోజులు ఉత్తర కోస్తా, రాయలసీమలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులు 30 నుంచి 40 కి.మీ వేగంతో కొన్ని చోట్ల వీచే అవకాశం ఉంద’’ని అధికారులు అంచనా వేశారు.

from news https://ift.tt/gXJzSHf
from news https://ift.tt/gXJzSHf
Post a Comment