మే 25 రాశిఫలాలు, ఈ రాశివారి జీవితంలో వసంతం వస్తుంది

మే 25 రాశిఫలాలు: ఈ రోజు మేషం, వృషభ రాశి వారికి ఈరోజు మంచిది. కర్కాటక, తుల, మీన రాశుల వారు ధన లాభం పొందుతారు. ధనుస్సు రాశివారి జీవితంలో వసంతం వెల్లివిరుస్తుంది. మే 25 గురువారం మిగిలిన రాశుల ఫలితాలు ఇక్కడ తెలుసుకోండి

మేష రాశి (Aries) (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)

మేష రాశి ఉద్యోగులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు. మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలి. ఈ రోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల నుంచి మీకు సంపూర్ణ సహకారం ఉంటుంది. కొత్త పనులు ప్రారంభించేందుకు ఈ రోజు మంచిరోజు. స్నేహితుల  మద్దతు ఉంటుంది. వ్యాపారం బాగానే సాగుతుంది.

వృషభ రాశి (Taurus) (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)

వృషభ రాశు శుభవార్త వింటారు. రోజంతా సంతోషంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తారు. మీ బాధ్యతలు నిర్వహిస్తారు. ఆదాయానికి కొత్త మార్గాలు కనిపిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండాలి.

మిథున రాశి (Gemini) (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)

మిథునరాశి వారికి ఈ రోజు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. వ్యాపారంలో ఎప్పటి నుంచో నిలిచిపోయిన పనులను ముందుకు తీసుకెళ్లగలుగుతారు. తల్లిదండ్రుల నుంచి సహకారం పొందుతారు. ఆర్థిక లాభాలున్నాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు శ్రద్ధ పెరుగుతుంది.  చురుగ్గా ఉంటారు. సామాజిక సేవలో పాల్గొనేందుకు ఉత్సాహం చూపిస్తారు.

కర్కాటక రాశి (Cancer) కర్కాటకం (పునర్వసు 4 పాదం, పుష్యమి, ఆశ్లేష)

కర్కాటక రాశివారికి ఈ రోజు రోజు ఫలవంతంగా ఉంటుంది. నిరుద్యోగులగు మంచి ఉద్యోగం, ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే సూచనలున్నాయి. పూర్వీకుల ఆస్తి కలిసొచ్చే అవకాశం ఉంది. మీరు మీ జీవిత భాగస్వామి నుంచి ప్రేమ పొందుతారు. అనుకోని అతిథులను కలుస్తారు. మీ ఆదాయం బాగుంటుంది. ఆధ్యాత్మిక విషయాలపై అవగాహన అవసరం.

సింహ రాశి (Leo)(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)

సింహ రాశి వారికి వ్యాపారంలో ఆశించిన లాభాలు లభిస్తాయి. ఉద్యోగంలో పురోగతికి అవకాశాలు ఉంటాయి. విహారయాత్రకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో కలసి ఓ శుభకార్యానికి హాజరవుతారు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. మిమ్మల్ని ఆకర్షించే పెట్టుబడి పథకాల గురించి లోతుగా తెలుసుకోవడానికి ప్రయత్నించండి.

కన్యా రాశి  (Virgo) (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు)

కన్యారాశి వారు ఓ శుభవార్త వింటారు. ఈ రాశి నిరుద్యోగులకు మంచి ఉపాధి లభిస్తుంది. చిరు వ్యాపారులు మంచి లాభాలు పొందుతారు. విద్యారంగంలో విజయం ఉంటుంది. విద్యార్థులు క్రీడా పోటీల్లో పాల్గొంటారు. ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. వివాహ జీవితం బావుంటుంది.

Also Read: మే 25 నుంచి రోహిణి కార్తె, రోళ్లు పగులుతాయని ఎందుకంటారు!

తులా రాశి (Libra) (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పాదాలు)

తులా రాశివారికి ఈ రోజు మంచి ఫలితాలున్నాయి. వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో విజయం సాధిస్తారు. ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. తీసుకున్న అప్పులను చెల్లించగలుగుతారు. ఎప్పటి నుంచో చేతికి అందాల్సిన డబ్బు అందుతుంది. తలపెట్టిన పనులు పూర్తిచేస్తారు.

వృశ్చిక రాశి (Scorpio) (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)

వృశ్చికరాశి వారికి ఈ రోజు బాగానే ఉంటుంది. వ్యాపారంలో ఊహించని లాభాలు పొందుతారు. మీకు వాహనయోగం ఉంది. మీ మనసులో ఉన్న కోరిక నెరవేరుతుంది.  కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. విద్యార్థులు క్రీడా పోటీల్లో పాల్గొంటారు. ఉన్నత విద్యకు అనుకూలమైన సమయం. మీరు మీ జీవిత భాగస్వామికి సంబంధించిన చిన్న చిన్న విషయాలు నిర్లక్ష్యం చేస్తారు. కొన్ని విషయాల్లో రిస్క్ తీసుకోవద్దు.

ధనుస్సు రాశి  (Sagittarius) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)

ధనుస్సు రాశి వారికి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. శుభవార్తలు అందుకుంటారు. పూర్తి నిజాయితీతో బాధ్యతను నిర్వర్తిస్తారు. తొందరపడి పెట్టుబడులు పెట్టొద్దు. జీవిత భాగస్వామితో  సరదా సమయం గడుపుతారు. తల్లిదండ్రుల సహకారం పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ మనసుకు శాంతి కలుగుతుంది. మీ జీవితంలో వసంతం వస్తుంది.  సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుకుంటారు.

Also Read: అమ్మో అమ్మవారి పాదాలకింద శివుడు, అప్పటికి కానీ ఆమె శాంతించలేదు

మకర రాశి (Capricorn) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)

మకర రాశివారికి ఈ రోజు ఆనందంతో నిండి ఉంటుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబం నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. గతంలో పెట్టిన పెట్టుబడులు లాభాలనిస్తాయి. శుభకార్యాలు నిర్వహిస్తారు. అనవసర వాదనలకు దిగొద్దు. ఇంటి అవసరాలకోసం ఖర్చులు ఎక్కువగా చేస్తారు. ఓ శుభవార్త వింటారు.

కుంభ రాశి  (Aquarius) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)

కుంభరాశివారికి మంచి రోజు. మీలో సానుకూల శక్తి నిండి ఉంటుంది. అందరి దృష్టిని ఆకర్షించడంలో సక్సెస్ అవుతారు. మీకోసం మీరు సమయం కేటాయించగలుగుతారు. మతపరమైన కార్యక్రమాలపై శ్రద్ధ పెడతారు. మానసిక ప్రశాంతతను అనుభవిస్తారు. వాహన ఆనందాన్ని కూడా పొందుతారు

మీన రాశి (Pisces) (పూర్వాభాద్ర 4 పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)

మీన రాశివారి ఆరోగ్యం మునుపటి కన్నా మెరుగుపడుతుంది. ఆర్థిక సమస్యలు ఎదుర్కోవలసి రావొచ్చు. సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి వృధా చేయవద్దు. కొన్ని చెడువార్తలు వినే అవకాశం ఉంది. ఎప్పటి నుంచో చేతికి రావాల్సిన మొత్తం అందుతుంది. గృహ జీవితం ఆనందంగా ఉంటుంది.

from news https://ift.tt/bJ7Nr4s

కామెంట్‌లు లేవు