NTR Returns To India : ఇండియా వచ్చేసిన ఎన్టీఆర్ - హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఫ్యాన్స్ గ్రాండ్ వెల్కమ్
NTR Returns To India : ఇండియా వచ్చేసిన ఎన్టీఆర్ - హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఫ్యాన్స్ గ్రాండ్ వెల్కమ్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) ఇండియా వచ్చేశారు. ఆస్కార్ వేడుక కోసం అమెరికా వెళ్ళిన ఆయన బుధవారం తెల్లవారుజామున హైదరాబాదులో అడుగు పెట్టారు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఎన్టీఆర్ వస్తున్నారని సమాచారం తెలియడంతో మంగళవారం అర్ధరాత్రి నుంచి ఎయిర్ పోర్ట్ దగ్గర వెయిట్ చేశారు. 'జై ఎన్టీఆర్' నినాదాలతో హోరెత్తించారు. ఆస్కార్ వేదికపై కీరవాణి, చంద్రబోస్... నాకు బెస్ట్ మూమెంట్ అంటే అదే - ఎన్టీఆర్ ఆస్కార్ వేడుకలో (Oscars 2023) బెస్ట్ మూమెంట్ ఏది? అని అడగ్గా... ''కీరవాణి గారు, చంద్రబోస్ గారు స్టేజి మీద నిలబడినప్పుడు! నా బెస్ట్ మూమెంట్ అంటే అదే'' అని ఎన్టీఆర్ చెప్పారు. ఆస్కార్ అవార్డు పట్టుకున్నప్పుడు మీ అనుభూతి ఏమిటి? అని ప్రశ్నించగా... ''చాలా బరువుగా ఉంది. మన దేశం ఎంత బరువుగా ఉందో, అవార్డు కూడా అంతే బరువుగా ఉంది. చేతిలో ఆస్కార్ ఉండటం అద్భుతమైన అనుభూతి. అది ఎన్నిసార్లు చెప్పినా చాలదు. నేను గర్వంగా ఫీలవుతున్నాను. 'ఆర్ఆర్ఆర్'ను చూసి గర్వపడుతున్నాను. చాలా చాలా ఆనందంగా ఉంది. కీరవాణి గారు, చంద్రబోస్ గారు అవార్డుతో స్టేజి మీద ఉన్నప్పుడు ఇంకా ఆనందంగా ఉంది. ప్రేక్షకులు అందరికీ ధన్యవాదాలు. ఈ అవార్డు వచ్చిందంటే అది ప్రేక్షక దేవుళ్ళ అభిమానం వల్లే, ఆశీర్వచనం వల్లే'' అని ఎన్టీఆర్ సమాధానం ఇచ్చారు. బాలకృష్ణ ఒక్కరే మా కుటుంబం - తారకరత్న భార్య సెన్సేషనల్ పోస్ట్" బాలకృష్ణ ఒక్కరే మా కుటుంబం - తారకరత్న భార్య సెన్సేషనల్ పోస్ట్ | Telangana: RRR Actor Jr NTR arrived at the Rajiv Gandhi International Airport in Hyderabad. Naatu Naatu' song from RRR won the for the Best Original Song భర్తను రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన ప్రణతి అమెరికాకు సతీసమేతంగా వెళ్లారు రామ్ చరణ్. ఆయన వెంట ఉపాసన కూడా ఉన్నారు. ఎన్టీఆర్ ఒక్కరే వెళ్లారు. ప్రణతి ఎందుకు వెళ్లలేదని ఫీలైన ఫ్యాన్స్ కొందరు ఉన్నారు. అయితే, భర్తను రిసీవ్ చేసుకోవడం కోసం ఆమె ఎయిర్ పోర్టుకు వచ్చారు. అవార్డు వచ్చిన విషయం తొలుత తన భార్యతో షేర్ చేసుకున్నట్లు ఎన్టీఆర్ తెలిపారు. "రామ్ చరణ్ ఆస్కార్ డ్రస్ వెనుక కథ - అల్లూరి స్ఫూర్తితో, మిలటరీని రిప్రజెంట్ చేసేలా" రామ్ చరణ్ ఆస్కార్ డ్రస్ వెనుక కథ - అల్లూరి స్ఫూర్తితో, మిలటరీని రిప్రజెంట్ చేసేలా అభిమాని సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు అతిథిగా...ఆస్కార్స్ నుంచి వచ్చిన ఎన్టీఆర్... రెండు రోజుల్లో అభిమాని సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో సందడి చేయనున్నారు. తారక్ వీరాభిమాని విశ్వక్ సేన్ హీరోగా నటించిన తాజా సినిమా 'దాస్ కా ధమ్కీ'. ఈ నెల 17న... అంటే శుక్రవారం హైదరాబాదులోని శిల్పకళా వేదికలో ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది. దానికి ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. అభిమానులు అందరూ ఆ వేడుక కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.ఎన్టీఆర్ ఫస్ట్... చరణ్ నెక్స్ట్ ! ఆస్కార్ అవార్డ్స్ (Oscar Awards 2023) సందర్భంగా సోషల్ మీడియాలో, న్యూస్ మీడియాలో అత్యధికంగా ప్రస్తావించిన నటుల (హీరోల) జాబితాలో మొదటి స్థానంలో ఎన్టీ రామారావు (Jr NT Rama Rao) నిలిచారు. ఆయన తర్వాత స్థానంలో రామ్ చరణ్ (Ram Charan) నిలిచారు. దాంతో అభిమానులు ఫుల్ ఖుషిలో ఉన్నారు.'ఆర్ఆర్ఆర్' తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో NTR 30 చేయడానికి యంగ్ టైగర్ రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నెలలో ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్ళనుంది. ఈ వారమే సినిమా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. from news https://latesttelugunew.in
Post a Comment