d

March 18 Horoscopes Family members of this zodiac sign tend to mistrust each other

March 18 Horoscopes

మార్చి 18 రాశిఫలాలు, ఈ రాశివారి కుటుంబ సభ్యులు ఒకరిపై మరొకరు అపనమ్మకం పెంచుకుంటారు

March 18 Horoscopes Family members of this zodiac sign tend to mistrust each other
march 18 Horoscopes family members of this zodiac



మేష రాశి ఈ రోజు ఈ రాశివారికి మానసిక ఆందోళన తప్పదు. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి పెట్టలేరు. ఎన్నో కొత్త ఆలోచనలు మీ మనసులో పరిగెడుతూనే ఉంటాయి. ఆదాయ మార్గాల బలోపేతానికి కృషి చేస్తారు. పిల్లలకు సంబంధించిన అవసరాలు తీర్చడంలో సక్సెస్ అవుతారు.

వృషభ రాశి ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. దాంపత్య జీవితంలో ఉండే వ్యక్తులు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ప్రేమ జీవితం గడిపేవారికి ఈ రోజు అంత మంచిది కాదు..వారు కూడా జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులకు శుభదినం

మిథున రాశి ఈ రోజు కుటుంబ స్థాయిలో ఆనందం పెరుగుతుంది.. కానీ చిన్న విషయాలకు కోపం వచ్చే అలవాటు మీ ఆనందాన్ని పాడు చేస్తుంది. ఈ రోజు కోపానికి దూరంగా ఉండడమే మంచిది. కొత్త వ్యక్తులను కలుస్తారు. రోజంతా సరదాగా గడుపుతారు

కర్కాటక రాశి ఈ రోజు ఈ రాశివారి ఆదాయం బాగుంటుంది. సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు. కొత్త నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి మీకు అవకాశం లభిస్తుంది, ఇది మీ కొత్త బాధ్యతలను నిర్వహించడానికి ఉపయోగపడుతుంది. ఈ రాశివారికి శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఆరంభం అంతంతమాత్రం - ద్వితీయార్థం సరిలేరు మీకెవ్వరు! ఈ రాశివారికి శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఆరంభం అంతంతమాత్రం - ద్వితీయార్థం సరిలేరు మీకెవ్వరు!

సింహ రాశి సింహ రాశివారికి ఈ రోజు మంచిరోజు. ఆరోగ్యం దృఢంగా ఉంటుంది. మీరు పని పరంగా కూడా మంచి ఫలితాలను పొందుతారు. కొందరికి బదిలీ జరిగే అవకాశం ఉంది. నిరుద్యోగుల నిరీక్షణ ఫలిస్తుంది 

కన్యా రాశి ఈ రోజు ఈ రాశివారి కుటుంబంలో ఒక శుభకార్యం జరుగుతుంది. మీరు భాగస్వామ్యంతో ఏదైనా పనిని ప్రారంభించడానికి ప్లాన్ చేస్తారు.  అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తిచేస్తారు

తులా రాశి ఈ రోజు ఎవరి సహాయానికి దూరంగా ఉండండం మంచిది. పరిశోధనలలో పాల్గొనేవారు విజయం సాధిస్తారు. కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. స్వీయ నియంత్రణ పెరుగుతుంది. జీవిత భాగస్వామితో సంబంధం బాగుంటుంది. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలున్నాయి 

వృశ్చిక రాశి ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది. ఆరోగ్యం బావుంటుంది.  మాటలో ఆచరణాత్మకత, మొండితనం మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తాయి. కుటుంబ వాతావరణం బాగుంటుంది కానీ కుటుంబ సభ్యులు ఏదో ఒక విషయంలో ఒకరిపై ఒకరు అపనమ్మకం పెంచుకునే ప్రయత్నం చేస్తారు.

ధనుస్సు రాశి ఈ రోజు ధనస్సు రాశివారి ఆలోచన దైవారాధనపై ఉంటుంది. కుటుంబంతో కలసి ఆధ్యాత్మిక ప్రదేశానికి వెళ్లే అవకాశం ఉంది. ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులు పనిపై దృష్టిసారిస్తారు. వ్యాపారం బాగా సాగుతుంది. 

మకర రాశి ఈ రోజు మీ మానసిక ఒత్తిడి పెరుగుతుంది. సహనంగా వ్యవహరించండ మంచిది. ప్రేమికులకు, వివాహితులకు ఈ రోజు అంత మంచి ఫలితాలు లేవు. ఏదో మొక్కుబడిగా వ్యవహరిస్తారు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ తగ్గుతుంది. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది శోభకృత్ నామ సంవత్సరంలో ఈ రాశివారికి అష్టమంలో గురుడు ఆరోగ్యంపై దెబ్బకొడతాడు, ఏ రంగం వారికీ శుభఫలితాలు లేవు! శోభకృత్ నామ సంవత్సరంలో ఈ రాశివారికి అష్టమంలో గురుడు ఆరోగ్యంపై దెబ్బకొడతాడు, ఏ రంగం వారికీ శుభఫలితాలు లేవు! 

కుంభ రాశి ఈ రోజు మీరు కొన్ని మంచి ఫలితాలను పొందుతారు..కొన్ని సందర్భాల్లో సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. మీ ఆదాయం పెరుగుతుంది. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. ఉద్యోగులు, విద్యార్థులకు మిశ్రమ ఫలితాలున్నాయి. 

మీన రాశిఈ రోజు మీరు కష్టపడి పనిచేయడం వల్ల ధనాన్ని పొందుతారు. స్నేహితులతో కలిసి ఎక్కడికైనా వెళ్లాలంటే ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకరి పట్ల మీ అభిప్రాయాన్ని మీకే పరిమితం చేయండి. పిల్లలతో సమయాన్ని గడపడం వల్ల సంతోషంగా ఉంటారు.

About this Blog 

Name : Harinath

From : Bellampalli

latetstelugunew.in
Latesttelugunew.in



కామెంట్‌లు లేవు