d

మార్చి 17 రాశిఫలాలు, ఈ రాశివారి కొంచెం కష్టపడినా మంచి ఫలితం పొందుతారు


rashi palalu,mesha rashi,danasu rachi
rashi palalu march 17


మేష రాశి ఈ రోజు మేష రాశి వారికి శుభదినం. వ్యాపారులు భారీ లాభాలు పొందే అవకాశం ఉంది. నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఉద్యోగులకు మంచి రోజు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. అయితే ఏ విషయంలోనూ మితిమీరిన ఉత్సాహం పనికిరాదు..అపార్థాలకు కారణం అవొచ్చు.

వృషభ రాశి ఈ రోజు మీకు మంచి రోజు. మీ వ్యక్తిగత ప్రయత్నాలతో విజయం సాధిస్తారు. అదృష్టం కలిసొస్తుంది. బయటకు వెళ్లే అవసరం ఉంటుంది. మనసు సంతోషంగా ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులకు మంచి రోజు. విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి

మిథున రాశి ఈ రోజు కుటుంబ సంబంధాలు బలంగా ఉంటాయి. కొంచెం కష్టపడితే మీ లక్ష్యాలను సులభంగా సాధిస్తారు. మీ ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. వ్యాపార పనుల పరంగా ఈ రోజు మంచి రోజు.శోభకృత్ నామ సంవత్సరంలో ఈ రాశివారికి ప్రశాంతత ఉండదు, కక్కలేక-మింగలేక అన్నట్టుంటుంది పరిస్థితి" శోభకృత్ నామ సంవత్సరంలో ఈ రాశివారికి ప్రశాంతత ఉండదు, కక్కలేక-మింగలేక అన్నట్టుంటుంది పరిస్థితి 

కర్కాటక రాశి ఈ రాశి వ్యాపారులు భారీ లాభాలు పొందుతారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ప్రేమికుల మధ్య కొంత విభేదాలు ఉండవచ్చు. ఈరోజు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఉద్యోగులు ఇతరవిషయాలకోసం సమయం వృధా చేయకుండా పనిపై దృష్టి సారించడం మంచిది.

సింహ రాశి :ఈ రోజు మీరు కొంచెం బలహీనంగా ఫీలవుతారు. ఆరోగ్యం దెబ్బతింటుంది. తలపెట్టిన పనుల్లో జాప్యం జరుగుతుంది. మీ కష్టానికి ప్రతిఫలం లభించడానికి సమయం పడుతుంది. ఈ రోజు ప్రేమ జీవితంలో అనుకూలమైన రోజు కాదు. 

కన్యా రాశి ఈ రోజు మీ రోజు..సంతోషంతో నిండి ఉంటుంది. సహోద్యోగులతో మంచి సమన్వయం ఉంటుంది. కొత్త వనరుల నుంచి ఆకస్మిక ధనలాభం పొందే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి సమతుల్యం అవుతుంది.

తులా రాశి ఈ రోజు మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. అప్పులు తీసుకోవడం తగ్గించాలి.స్పెక్యులేటివ్ పెట్టుబడులకు కూడా దూరంగా ఉండాలి. వ్యాపారంలో భాగస్వాములు మోసం చేయవచ్చు...అప్రమత్తంగా వ్యవహరించండి శోభకృత్ నామ సంవత్సరంలో ఈ రాశివారు బాగా సంపాదిస్తారు కానీ మానసికంగా కృంగిపోతారు అంతలోనే ధైర్యంగా దూసుకెళ్తారు" శోభకృత్ నామ సంవత్సరంలో ఈ రాశివారు బాగా సంపాదిస్తారు కానీ మానసికంగా కృంగిపోతారు అంతలోనే ధైర్యంగా దూసుకెళ్తారు

వృశ్చిక రాశి ఈ రోజు వృశ్చిక రాశి వారికి మంచి రోజు. ఓ ప్రయాణం చేయాల్సి రావొచ్చు...ఈ ప్రయాణం  మీకు మానసిక ఆనందాన్ని ఇస్తుంది. మీరు ఓ ప్రత్యేకమైన వ్యక్తిని కలిసే అవకాశం పొందుతారు.

ధనుస్సు రాశి ఈ రోజు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. విద్యార్థులకు వారి ఉపాధ్యాయుల పూర్తి మద్దతు లభిస్తుంది. కెరీర్ లో ముందుకు సాగడానికి కొత్త అవకాశాలు కూడా వస్తాయి. నిరుద్యోగులు ఉద్యోగం సంపాదిస్తారు.

మకర రాశి బంధువుల నుంచి పెద్ద బహుమతి పొందుతారు. ఏదైనా చిన్న ప్రమాదం జరిగే అవకాశం ఉంది. మీ వ్యక్తిగత సంబంధాలను చాలా ప్రశాంతంగా  ఉంచడం మంచిది. అలా చేయడం ద్వారా మీరు ఎన్నో సమస్యలను నివారించవచ్చు. ఆరోగ్యం బావుంటుంది. ఆర్థిక పరిస్థితి కూడా ఆశాజనకంగా ఉంటుంది.

కుంభ రాశి ఈ రోజు మీకు  మిశ్రమ ఫలితాలున్నాయి. చాలా విషయాలలో శ్రద్ధ వహించాల్సి ఉంటుంది..వాటిలో మీ ఆరోగ్యం మొదటిది, రెండోది ఆర్థిక పరిస్థితి. కొన్ని సమస్యలు ఎదురవుతాయి, మానసిక ఒత్తిడి ఉంటుంది.

మీన రాశి ఈ రోజు మీరు మీ లక్ష్యాన్ని నిర్దేశించుకోవడానికి కొత్త ప్రణాళికను రూపొందిస్తారు. కుటుంబ సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవడంలో విజయం సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న ఈ రాశి వారికి ఈరోజు శుభవార్త అందుతుంది.

కామెంట్‌లు లేవు