d

మార్చి 16 రాశిఫలాలు, ఈ రోజు ఈ రాశివారికి సంపద, ప్రతిష్ట పెరుగుతాయి

మేష రాశి : ఈ రోజు మీ బాధ్యతలపై పూర్తి శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అధికారుల నుంచి సహాయసహకారాలు లభిస్తాయి. అనుకున్నవి నెరవేరుతాయి. జీవిత భాగస్వామి, సంతానం కారణంగా సంతోషంగా ఉంటారు. ఆకస్మిక ధనలాభం పొందే అవకాశం ఉంది.ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు జరుపుతారు..ఆ చర్చల్లో కొన్ని కొత్త విషయాలు తెలుసుకుంటారు. మనసులోని విషయాలను ఎవరితోనైనా పంచుకోవాలనే కోరిక ఉండొచ్చు.విద్యార్థులకు ఈ రోజు శుభసమయం.  
వృషభ రాశి ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఈ రోజు పూర్తవుతాయి. ఈ రోజు మీరు ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్న ఓ వ్యక్తిని కలుస్తారు..వారి మార్గదర్శకత్వం మీకు చాలా ఉపయోగడుతుంది. ఓ పనిపై ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఉద్యోగులకు బదిలీలు జరిగే అవకాశం ఉంది. కుటుంబ వాతావరణం చాలా మెరుగ్గా ఉంటుంది. వైవాహిక జీవితం గడిపే వ్యక్తులు కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ప్రేమికులకు మంచి రోజు. 
మిథున రాశి : ఈ రోజంతా మీరు ఏదో పనిలో బిజీగా ఉంటారు. కార్యాలయంలో మీ బాధ్యతను సకాలంలో పూర్తిచేస్తారు. మీరు మీ కోపాన్ని నియంత్రించుకోవాలి, లేకపోతే చేసిన పనిపై ఆ ప్రభావం పడే అవకాశం ఉంది. పనిలో పడి ఆహారాన్ని, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. శోభకృత్ నామ సంవత్సరంలో ఈ రాశివారు బాగా సంపాదిస్తారు కానీ మానసికంగా కృంగిపోతారు అంతలోనే ధైర్యంగా దూసుకెళ్తారు"   
శోభకృత్ నామ సంవత్సరంలో ఈ రాశివారు బాగా సంపాదిస్తారు కానీ మానసికంగా కృంగిపోతారు అంతలోనే ధైర్యంగా దూసుకెళ్తారు 
కర్కాటక రాశి : ఈ రోజు మీకు శుభదినం. మీరు బాధ్యత వహిస్తున్న పని ప్రదేశంపై ఓ కన్నేసి ఉంచడం చాలా ముఖ్యం. ఎందుకంటే మీ సహోద్యోగులు మీ సహనాన్ని పరీక్షిస్తారు. కొత్త అలంకరణలతో ఇంటి అందాన్ని పెంచుతారు. మీ తల్లిదండ్రుల నుంచి ప్రయోజనం పొందుతారు. సంపద, ప్రతిష్ట పెరుగుతాయి. ఈ రోజు మీరు జరిపే సంభాషణలు, ఊహాగానాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీరు అత్యంత సన్నిహితులు అనుకుంటున్నవారిలో స్వార్థపరులున్నారు జాగ్రత్త...
సింహ రాశి : ఈ రోజు మీకు మిశ్రమంగా ఉంటుంది. ఆరోగ్యం బావున్నట్టే అనిపిస్తుంది కానీ అకస్మాత్తుగా ఇబ్బందిపడతారు. ఆస్తి వ్యవహారాల్లో లబ్ది పొందుతారు. ఉద్యోగులు, వ్యాపారులు పనిపై శ్రద్ధ పెట్టాలి. విద్యార్థులు చదువునుంచి ఆలోచన మరల్చుకోవద్దు. 
కన్యా రాశి : ఈ రోజు ఈ రాశివారు కుటుంబంతో సంతోషంగా ఉంటారు. ఉద్యోగులకు కార్యాలయంలో సహోద్యోగుల నుంచి సహకారం అందుతుంది. స్నేహితులతో కలసి బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉండే అవకాశం ఉంది. వ్యాపారులు, విద్యార్థులు కష్టపడితేనే ఫలితం అందుకుంటారు 
తులా రాశి : ఈ రోజు వాతావరణం సానుకూలంగా ఉంటుంది. ఉన్నతాధికారులతో ఉద్యోగుల సమన్వయం బావుంటుంది. వ్యాపారులు నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఓ వ్యక్తిని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే వారితో స్నేహం చేయండి. హమ్మయ్య ఈ ఉగాదితో ఈ రాశివారికి 'శని' వదిలిపోయింది, ఇక మంచిరోజులు మొదలైనట్టే!  హమ్మయ్య ఈ ఉగాదితో ఈ రాశివారికి 'శని' వదిలిపోయింది, ఇక మంచిరోజులు మొదలైనట్టే! 
వృశ్చిక రాశి : ఈ రోజు మీకు అంతబాగా లేదు. ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ప్రయాణాలలో అసౌకర్యం ఉండొచ్చు. పనికి సంబంధించి సహోద్యోగులతో వివాదం జరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది 
ధనుస్సు రాశి : ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది...అనుకున్న పనులన్నీ పూర్తిచేస్తారు. ఏదైనా సృజనాత్మక పని పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది. మీ సమస్యలన్నింటికీ సులభంగా పరిష్కారం దొరుకుతుంది. మీ వైవాహిక బంధం మాధుర్యంతో నిండి ఉంటుంది
మకర రాశి : ఈ రాశివారికి..దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. వీలైనంత వరకు మీ డబ్బును పొదుపు చేయాలనే ఆలోచనను పెట్టుకోండి. మీ ప్రియమైనవారితో చర్చించే అవకాశం వచ్చినప్పుడు సమస్యల గురించి మాట్లాడొద్దు. అనవసర డిమాండ్లకు తలవంచొద్దు.. 
కుంభ రాశి : కుంభ రాశివారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. డబ్బును పెట్టుబడి పెట్టకుండా ఉండటం మంచిది. పనికి సంబంధించి ఈ రోజు బాగుంటుంది. కష్టానికి తగిన ఫలితం పొందుతారు. కుటుంబ వాతావరణం బాగుంటుంది. మీన రాశి ఈ రోజు ఈ రాశి ఉద్యోగులు తమ పనితీరుకి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారులు ధనలాభం పొందే అవకాశాలున్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కొన్ని ముఖ్యమైన పనులు కొంతకాలం ఆగిపోవచ్చు.
from news https://latesttelugunew.in

కామెంట్‌లు లేవు